iPhone 17: ఐఫోన్ 17 కొనాలనుకుంటే చలో దుబాయ్.. రూ.30వేలు సేవ్

యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత్‌లో ఎక్కువగా ఉండటంతో, చాలామంది దుబాయ్‌కి వెళ్లి కొనుగోలు చేస్తే లాభమా అనే విషయంపై చర్చిస్తున్నారు.

New Update
iphone 17 Release Date (1)

IPhone 17 Release Date

యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత్‌లో ఎక్కువగా ఉండటంతో, చాలామంది దుబాయ్‌కి వెళ్లి కొనుగోలు చేస్తే లాభమా అనే విషయంపై చర్చిస్తున్నారు. వాస్తవానికి, దుబాయ్‌కి వెళ్లి ఫ్లైట్ టికెట్, ఇతర ఖర్చులను కలిపినా కూడా భారత్‌లో కొనుగోలు చేయడం కంటే చాలా డబ్బు ఆదా అవుతుంది.

భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) ధర రూ.1,49,900గా ఉంది. అదే దుబాయ్‌లో దీని ధర 5,099 AED, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,22,500. దీని ప్రకారం, ఫోన్ ధరలోనే దాదాపు రూ.27,400 తేడా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ ఖర్చుల గురించి చూద్దాం. ఢిల్లీ లేదా ముంబై నుంచి దుబాయ్‌కి విమాన టికెట్ ధర సాధారణంగా రూ.12,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్లినా, టికెట్ ఖర్చు రూ.25,000 లోపే ఉంటుంది. దీంతో, మొత్తం ఖర్చు రూ.1,47,500 (ఫోన్ ధర + విమాన టికెట్) అవుతుంది. ఇది భారత్‌లో ఫోన్ ధర కంటే తక్కువ. ఒకవేళ ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులను కలిపినా, దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

అందుకే, ఐఫోన్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా దుబాయ్‌కి వెళ్లడం ఒక లాభదాయకమైన ఆలోచన అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దుబాయ్‌లో కొనుగోలు చేసిన ఫోన్‌కు భారతదేశంలో వారంటీ లభిస్తుందా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్లోబల్ వారంటీ పాలసీలు దేశానికి తగ్గట్టుగా మారవచ్చు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత, దుబాయ్ ప్రయాణం చేసి ఐఫోన్ కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు