/rtv/media/media_files/2025/09/15/iphone-17-air-vs-samsung-galaxy-s25-edge-2025-09-15-07-37-39.jpg)
Samsung Galaxy S25 Edge
అమెరికన్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ ఇటీవలే తన తదుపరి సిరీస్‌ను లాంచ్ చేసింది. iphone 17 seriesను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అందులో iphone 17, iphone 17 air, iphone 17 pro, iphone 17 pro max ఉన్నాయి. వీటిలో iphone 17 air వేరియంట్ కొత్తగా వచ్చింది. ఇది ఆపిల్ ఐఫోన్ కెరీర్‌లోనే అత్యంత సన్నని ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ మొబైల్ ధర, ఫీచర్లు.. అదేసమయంలో ఐఫోన్ మాదిరి ధర, ఫీచర్లు ఉన్న Samsung Galaxy S25 Edge మధ్య తేడా తెలుసుకుందాం.
ధర
iphone 17 air లోని 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,900, 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900గా ఉంది.
అదే సమయంలో Samsung Galaxy S25 Edgeలోని 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ.1,09,999, 12GB RAM + 512GB వేరియంట్ ధర రూ.1,21,999గా కంపెనీ నిర్ణయించింది.
డిస్ప్లే
iphone 17 air ఫోన్ 6.5-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2736x1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
Samsung Galaxy S25 Edge 6.7-అంగుళాల క్వాడ్ HD+ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1440x3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ప్రాసెసర్‌లో
ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్ ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఐఫోన్ 17 ఎయిర్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26 తో వస్తుంది. అదే సమయంలో Samsung Galaxy S25 Edge Android 15 ఆధారంగా One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
కెమెరా సెటప్
ఐఫోన్ ఎయిర్ వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్‌ల కోసం 18-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
Samsung Galaxy S25 Edge వెనుక భాగంలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఎంపికలు
ఐఫోన్ ఎయిర్‌లో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6, GPS, NFC వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు ఉన్నాయి. అదే సమయంలో Samsung Galaxy S25 Edge కనెక్టివిటీ ఎంపికలలో.. Wi-Fi 7, GPS, NFC, USB టైప్ C, Wi-Fi డైరెక్ట్ 3G, 4G ఉన్నాయి.