Flipkart Mobile Offers: IPhone 16పై రూ.27వేల భారీ తగ్గింపు.. వదలొద్దు మావా వెంటనే కొనేయ్..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో ఐఫోన్ 16పై భారీ ధర తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ రూ.79,900కి లాంచ్ కాగా.. ఇప్పుడు రూ. 69,999కి లిస్ట్ అయింది. ఈ సేల్‌లో కేవలం రూ.51,999కే లభిస్తుంది. లాంచ్ ధర కంటే ఇప్పుడు రూ.27,901 తగ్గింపు లభిస్తుందన్నమాట.

New Update
iphone 16 price cut

iphone 16 price cut

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkart Big Billion Days Sale 2025లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, టీవీలు.. సహా మరెన్నో ప్రొడెక్టులను భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఇక ఈ సేల్‌లో ఐఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ సేల్‌లో IPhone 16 ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బేరసారాల ధరకు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16 ఒక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్ సందర్భంగా ఈ-కామర్స్ సైట్ ఐఫోన్ 16పై గణనీయమైన ధర తగ్గింపులు, ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందుబాటులో ఉంచింది. 

iPhone 16 Price & Offers

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో iPhone 16 సెప్టెంబర్ 2024లో రూ.79,900కి లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ ఫోన్ రూ. 69,999 కే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సేల్‌లో iPhone 16 కేవలం రూ.51,999కే లభిస్తుంది. అంటే లాంచ్ ధర కంటే 
iPhone 16పై ఇప్పుడు రూ.27,901 భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై డిస్కౌంట్లు పొందొచ్చు. ఈ తగ్గింపులు 
iPhone 16 ధరను మరింత తగ్గిస్తాయి. అలాగే పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా మరింత ఆదా చేసుకోవచ్చు.

iPhone 16 Features & Specifications

iPhone 16 ఫీచర్ల విషయానికొస్తే.. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను 1179x2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 2000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ iPhone 16  ఆక్టా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 

వెనుక కెమెరాలో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. iPhone 16 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు