/rtv/media/media_files/2025/01/08/LdAZN9CY3h235ikRGifO.jpg)
iphone 15 price drop
ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు ఎప్పటి నుంచో ఒక కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన అవకాశం. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన iPhone 15 ఇప్పుడు భారీ ధర తగ్గింపును పొందుతోంది. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు iPhone 15 ఆఫర్‌లు, దాని స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
iPhone 15 offers
iPhone 15లోని 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,900 లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇది కేవలం రూ.59,900 లకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ట్రాన్షక్షన్లపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.57,900 కు చేరుకుంటుంది. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.41,400 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఇంతమొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ తగ్గింపు కలిపి దాదాపు రూ.22,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.
iPhone 15 Specifications
iPhone 15 మొబైల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1179x2556 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌తో వస్తుంది. iPhone 15.. Apple A16 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఐఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. iPhone 15 దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. iPhone 15 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, GPS, NFC, బ్లూటూత్, Wi-Fi, డెడికేటెడ్ పోర్ట్ ఉన్నాయి. అలాగే iPhone 15 ఫోన్‌లోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, బేరోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్ ఉన్నాయి.
Follow Us