HMD Barbie Phone: రూ.7,999లకే డబుల్ డిస్‌ప్లే ఫోన్.. సేల్ ప్రారంభం!

HMD బార్బీ ఫోన్‌ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.7,999గా నిర్ణయించింది. HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

New Update
HMD Barbie Phone

HMD Barbie Phone Photograph: (HMD Barbie Phone)

స్మార్ట్‌ఫోన్ కంపెనీ HMD గత నెలలో భారతదేశంలో HMD బార్బీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లిప్ ఫోన్‌లో 2.8-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే.. 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఒకే పింక్ కలర్‌లో వస్తుంది. ఈ బార్బీ ఫోన్‌లో 1,450mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్లు తెలుసుకుందాం. 

HMD Barbie Phone Price

HMD బార్బీ ఫోన్ రూ.7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఇది పవర్ పింక్ కలర్‌లో మాత్రమే వస్తుంది. HMD బార్బీ ఫోన్ రిటైల్ బాక్స్‌ను బంగారం పెట్టెగా కూడా ఉపయోగించవచ్చు. HMD ఈ ఫోన్‌తో పాటు బార్బీ థీమ్‌తో వెనుక కవర్, స్టిక్కర్లు, పూసల లాన్యార్డ్ పట్టీని అందించింది.

HMD Barbie Phone Specifications

HMD బార్బీ ఫోన్‌లో 2.8-అంగుళాల QVGA ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఫోన్ బయటి డిస్ప్లే కూడా అద్దంలా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో యూనిసోక్ T107 ప్రాసెసర్ అందించారు. ఇది 64MB RAM + 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు విస్తరించవచ్చు. HMD బార్బీ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది బార్బీ థీమ్ వాల్‌పేపర్‌లు, సంబంధిత యాప్ ఐకాన్‌లతో వస్తుంది.

దీని వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 0.3 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 108.4 మిమీ పొడవు, 18.9 మిమీ మందం, 55.1 మిమీ వెడల్పు, 123.5 గ్రాములు బరువు ఉంటుంది. బార్బీ ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది వైర్డు, వైర్‌లెస్ మోడ్‌లతో FM రేడియో, MP3 ప్లేయర్‌తో వస్తుంది.

tech-news | telugu tech news | HMD Barbie Flip Phone | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు