/rtv/media/media_files/2025/04/16/KGiu1wd8du517mlSmfLV.jpg)
Google AI Guide
Google AI Guide: రోజురోజుకీ ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా Chat GPT, Gemini AI హవానే నడుస్తోంది. ఇటీవల కాలంలో "ప్రాంప్ట్ ఇంజినీరింగ్"(Prompt Engineering) అనే కాన్సెప్ట్‌కి కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. దీని అర్థం ఏంటంటే ఏఐకి ఇచ్చే సూచనలు (లేదా ప్రశ్నలు) అవి స్పష్టంగా, సింపుల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన బెస్ట్ సమాధానాన్ని పొందగలుగుతాం.
ఇప్పుడు గూగుల్ తన 'జెమినీ' టూల్‌ను బాగా ఉపయోగించుకునేందుకు 68 పేజీల ప్రత్యేక గైడ్‌ని విడుదల చేసింది. ఇది గూగుల్ వేర్టెక్స్ ఏఐ (Vertex AI) ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులో ఉంటుంది.
Also Read: హారర్ బాట పట్టిన నాగ చైతన్య.. 'NC 24' పై క్రేజీ అప్‌డేట్
ప్రాంప్ట్ అంటే ఏంటి?
ఏఐకి మీరు ఇచ్చే ప్రశ్న, సూచన, ఆదేశమే "ప్రాంప్ట్". మీరు విషయాలను ఎంత స్పష్టంగా చెబితే, ఏఐ కి అర్థం చేసుకోవడం అంత తేలిక. మంచి ఫలితాల కోసం ప్రాంప్ట్ క్లియర్‌గా ఉండటం చాలా అవసరం.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ప్రాంప్ట్ ఇవ్వడానికీ గూగుల్ కొన్ని సూచనలు..
1. ఉదాహరణలతో AIని అడగాలి అనుకున్నది అడగండి.
మనుషులకు ఏదైనా కొత్తగా నేర్పాలంటే ఉదాహరణలు ఇవ్వడం ఎంత అవసరమో, ఏఐకీ అదే వర్తిస్తుంది. మీరు ఎలా భావిస్తున్నారో ఏఐకి అర్థం కావాలంటే దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
2. సింపుల్ గా, స్పష్టంగా అడగండి:
బోలెడంత సమాచారం ఇచ్చేస్తే ఏఐ అయోమయానికి లోనవుతుంది. కాబట్టి, చిన్న వాక్యాలతో, స్పష్టంగా చెప్పడం మంచిది.
3. “ఏం చేయాలో” చెప్పండి, “ఏం చేయవద్దో” కాదు:
“ఇది చెయ్యి” అని చెప్పడం ఏఐకి స్పష్టంగా ఉంటుంది. “ఇది చేయవద్దు” అని అంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఇంకా అడ్వాన్స్‌డ్ టిప్స్..
మీరు ఏఐకి ఓ పాత్ర కూడా ఇవ్వొచ్చు. ఉదాహరణకి “నీవు ఓ టీచర్” అని చెప్పడం. అదనపు కాంటెక్స్ట్ కూడా ఇవ్వొచ్చు. ఉదాహరణకి “ఈ విద్యార్థికి గణితం బాగా రాదు.” సమాధానాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఇవ్వమని అడగండి అప్పుడు మంచి, ఖచ్చితమైన సమాధానాలు దొరుకుతాయి.
గూగుల్ జెమినీ టూల్‌ను కరెక్ట్ గా వాడాలంటే, ప్రాంప్ట్‌లు ఎలా ఉండాలి అన్న విషయమై గూగుల్ VERTEX లో అందుబాటులో ఉన్న ఈ కొత్త గైడ్ స్పష్టమైన దిశనిర్దేశం ఇస్తోంది. సరైన ప్రాంప్ట్‌తో ఏఐ నుంచి మరింత సహాయం పొందొచ్చు. కొత్తగా లెర్న్ అవ్వాలనుకునేవారికీ, ప్రొఫెషనల్‌గా వాడే వాళ్లకు కూడా ఈ గైడ్ ఎంతో ఉపయోగపడుతుంది.