/rtv/media/media_files/2025/04/16/S1gotTyuTWXdOgxr8NTf.jpg)
NC 24 Update
NC 24 Update: తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya), అదే జోష్‌తో తన 24వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ తో కలసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌లో, చైతన్య, మీనాక్షి సహా కీలక నటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ సుమారు 15 రోజులు కొనసాగనున్నట్లు తెలిసింది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
హారర్ థ్రిల్లర్‌గా సాగే..
ఇది హారర్, ఆధ్యాత్మికత, మిథాలజీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నాగ చైతన్య ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని కొత్తరకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి తీసుకుంటున్నారు. సినిమాటోగ్రఫీని షామ్ దత్ హ్యాండిల్ చేస్తున్నారు.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ఇప్పటికే క్రేజీ కాంబినేషన్‌గా మారిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తయి థియేటర్లలో విడుదల అయ్యే వరకు, ఫ్యాన్స్ ఎదురుచూపులు తప్పవు!
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
All the best to the Entire team of #NC24
— NC24 ❤️🔥❤️🔥 (@ThandelRaju) April 15, 2025
Officially shoot has begun ❤️🔥💥 pic.twitter.com/LemxF6qpUr