Google NotebookLM: ఇప్పుడు 50కి పైగా భాషల్లో మీ నోట్స్‌ను చదివి వినిపిస్తుంది!

గూగుల్ NotebookLM కొత్త ఫీచర్‌తో 50కి పైగా భాషల్లో మీ నోట్స్‌ను ఆడియోగా వినచ్చు. 'Audio Overviews' ద్వారా నోట్స్‌లోని సమాచారాన్ని వాయిస్ రూపంలో అర్థం చేసుకోవచ్చు. "Output Language" సెట్టింగ్ ద్వారా మీరు ఏ భాషలో ఆడియో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.

New Update
Google NotebookLM

Google NotebookLM

Google NotebookLM అనే AI టూల్‌కు కొత్త అప్‌డేట్‌ విడుదలైంది. ఈ అప్‌డేట్‌తో, మీరు మీ నోట్స్‌ను 50కి పైగా భాషల్లో ఆడియోగా వినవచ్చు! ఇందులో హిందీ, టర్కిష్, ఆఫ్రికాన్స్ లాంటి భాషలూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది తమకు ఇష్టమైన భాషలోనే సమాచారాన్ని ఆడియో రూపంలో వింటూ  అర్థం చేసుకోవచ్చు.

Also Read: Iphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే!

"Audio Overviews" అంటే ఏంటి?

'ఆడియో Overviews' అనేవి మీ నోట్స్ లేదా స్టడీ మెటీరియల్‌ కు సంబంధించి చిన్న పాడ్‌కాస్ట్‌ల లా ఉండే రివ్యూలు. మీరు డాక్యుమెంట్లు, ఆర్టికల్స్, నోట్స్ వంటి విషయాలను NotebookLM‌లో అప్‌లోడ్ చేస్తే, అవి ఓ చాట్‌లా, ఆడియో ఫార్మాట్‌లో మీకు అర్థమయ్యేలా చెబుతాయి. ఇది చదవడం కన్నా వినడం ఇష్టపడే వారికి చాలా ఉపయోగకరం.

Also Read: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

ఇది ఒకే ఆడియో కాదు, రెండు AI "హోస్టులు" (అంటే వాయిస్‌లు) అవి మనకి ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటూ చెబుతాయి. ఇది చదివి గుర్తుంచుకునే వారి కంటే వినడం ద్వారా విషయాలను గుర్తుంచుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.

అయితే  NotebookLM లోని "Output Language" సెట్టింగ్ ద్వారా మీరు ఏ భాషలో ఆడియో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా chatbot సమాధానాలు కూడా అదే భాషలో వస్తాయి. మీరు ఎప్పుడైనా భాష మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌ వేర్వేరు భాషల్లో చదివే వారికి చాలా ఉపయోగకరం.

Also Read: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

విద్యార్థులు, టీచర్లు ఇలా వాడుకోవచ్చు

ఉదాహరణకు, ఒక టీచర్ అమెజాన్ అడవులపై పాఠం సిద్ధం చేస్తున్నాడు అనుకోండి. ఆయన దగ్గర పోర్చుగీస్ డాక్యుమెంట్లు, స్పానిష్ ఆర్టికల్స్, ఇంగ్లిష్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ NotebookLM‌లో అప్‌లోడ్ చేస్తే, ఒక్క క్లిక్‌తో ఆ డేటా మొత్తం తెలుగు లేదా మరే భాషలోనైనా ఆడియో వినవచ్చు.
ఇది విద్యార్థులకు కూడా చదవడం కన్నా వినడం ద్వారా విషయాలు త్వరగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

ఎలా వాడాలి?

  • Google NotebookLMలో లాగిన్ అవ్వండి. 
  • మీ నోట్స్ లేదా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. 
  • "Notebook Guide"లో "Generate" క్లిక్ చేయండి.
  • "Output Language" సెట్టింగ్‌లో మీ ఇష్టమైన భాషను ఎంచుకోండి.
  • ఇక ఆడియోగా వినండి, లేదా టెక్స్ట్ రూపంలో చదవండి.
Advertisment
Advertisment
తాజా కథనాలు