/rtv/media/media_files/2025/09/27/flipkart-waterproof-mobile-offers-2025-09-27-14-51-04.jpg)
Flipkart Waterproof Mobile Offers
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ఫ్యాన్‌లు, ఫ్రిడ్జ్‌లను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను చీపెస్ట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్కువగా వాటర్ ప్రూఫ్ మొబైల్స్ కోసం చూస్తున్నవారికి పండగ అనే చెప్పాలి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లతో ఇప్పుడు వాటిని కేవలం రూ.20,000 కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ఏవో తెలుసుకుందాం.
Flipkart Big Billion Days Sale 2025 Water Resistant Smartphones
Motorola Edge 60 Fusion
మోటరోలా కంపెనీ Motorola Edge 60 Fusionను ప్రీమియం లుక్, తక్కువ బరువు, పాంటోన్ కలర్‌తో పరిచయం చేసింది. మోటరోలా వాటర్ అండ్ రెసిస్టెన్సీ కోసం IP68/IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అంటే వర్షంలో తడిసినా ఫోన్‌కు ఏం కాకుండా రక్షణగా ఇది పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లిస్టింగ్‌లో Motorola Edge 60 Fusion.. 8/256జీబీ వేరియంట్ రూ. 25,999 ధరకు ఉండగా.. 19శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్ లభిస్తోందన్నమాట. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు, రూ.16000 భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Moto G96 5G
Moto G96 5G ఫోన్ IP68 రేటింగ్‌తో వచ్చింది. దీని అసలు ధర రూ.20,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దీనిపై కూడా రూ.5000 డిస్కౌంట్ లభిస్తోందన్నమాట. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు, రూ.12100 భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇది బేస్ వేరియంట్‌కు వర్తిస్తుంది.
Realme P3 Pro
Realme P3 Pro మొబైల్ IP68, IP66, IP69 రేటింగ్‌లతో వస్తుంది. ఇది వర్షం, స్ప్రే, అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుందని కంపెనీ చెప్పింది. Realme బిగ్ బిలియన్ డేస్ లిస్టింగ్ Realme P3 Pro అసలు ధర రూ.28,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 16,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత దీనిని ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
POCO X7 Pro
POCO X7 Pro స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇది కూడా భారీ వర్షం, నీటి తుంపరలను తట్టుకోగలదు. POCO X7 Pro అసలు ధర రూ.32,999 ఉండగా.. ఇప్పుడు Flipkart BBD డీల్‌లో రూ20,999 గణనీయమైన ధర తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో దీనిని రూ.20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Vivo T4R 5G
Vivo T4R 5G మొబైల్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వచ్చింది. ఇది మెరుగైన వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ, ప్రత్యేక స్పీకర్ డ్రెయిన్ మెకానిజంతో వస్తుంది. కాబట్టి దీనిని నీటి అడుగున ఫోటోగ్రఫీకి ఉపయోగించవచ్చు. ఇది మిలిటరీ-గ్రేడ్, SGS 5-స్టార్ సర్టిఫైడ్ కూడా పొందింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,499లకు లిస్ట్ అయింది. బిగ్ బిలియన్ డేస్ డిస్కౌంట్లు, బ్యాంక్ -క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల తర్వాత Vivo T4R 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది.