Mobile offers: ఊరమాస్ ఆఫర్.. ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ వెంటనే కొనేయండి మచ్చా..!

దీపావళి తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. Oppo K13x 5G భారీ తగ్గింపుతో లభిస్తుంది. 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీంతో రూ.9,999కి కొనుక్కోవచ్చు.

New Update
flipkart mobile offers Oppo K13x 5G

flipkart mobile offers Oppo K13x 5G

దసరా, దీపావళి పండుగ ముగిసింది. దీంతో అమెజాన్, విజయ్ సేల్స్ వంటి ఆన్ లైన్ సంస్థల ఆఫర్లు కూడా పూర్తయ్యాయి. కానీ దీపావళి తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. కేవలం రూ.10,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. Oppo సరసమైన 5G ఫోన్ Oppo K13x 5G సేల్ సమయంలో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ధరల తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లతో కస్టమర్లు మరింత ఆదా చేసుకోవచ్చు. Oppo K13x 5Gలో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, ఫీచర్‌లను వివరంగా తెలుసుకుందాం.

Oppo K13x 5G offers

Oppo K13x 5Gలోని 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో.. ఎంపిక చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత Oppo K13x 5G రూ.9,999కి కొనుక్కోవచ్చు. అనంతరం ఇప్పటికే ఉన్న లేదా పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడం వల్ల ధర రూ.11,000 వరకు తగ్గుతుంది. అయితే ఇక్కడ.. ఇంత పెద్ద మొత్తంలో ప్రయోజనం పొందాలంటే పాత ఫోన్ స్థితి, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.

Oppo K13x 5G specs

Oppo K13x 5G స్మార్ట్ ఫోన్ 1604x720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. Oppo K13x 5G.. f/1.88 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ ల కోసం ముందు భాగంలో f/2.05 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్  కెమెరాను అందించారు. 

Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Oppo K13x 5G కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15పై నడుస్తుంది. 

Advertisment
తాజా కథనాలు