Cheapest Recharge Plans: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 2500GB డేటా, 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీ..!

BSNL దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించింది. తన 25 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘సిల్వర్ జూబ్లీ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా డేటా, OTT, లైవ్ టీవీల ప్రయోజనాలు పొందుతారు. 

New Update
bsnl Silver Jubilee FTTH Broadband Plan

bsnl Silver Jubilee FTTH Broadband Plan

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించింది. తన 25 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో  కంపెనీ ‘సిల్వర్ జూబ్లీ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు డేటా, OTT, లైవ్ టీవీల ప్రయోజనాలు పొందుతారు. 

BSNL Silver Jubilee FTTH Broadband Plan

ఈ కొత్త ప్లాన్‌ FTTH బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే. వారు నెలకు రూ.625 రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా 70 Mbps వేగంతో 2500GB వరకు డేటాను పొందుతారు. FUP తర్వాత కూడా OTT స్ట్రీమింగ్, బేసిక్ బ్రౌజింగ్‌ను సౌకర్యవంతంగా నిర్వహించడానికి ఇంటర్నెట్ వేగం సరిపోతుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు 600 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ కు యాక్సెస్ పొందుతారు. వాటిలో 127 ప్రీమియం ఛానెల్స్ కూడా ఉన్నాయి.

అంతేకాకుండా ఈసారి BSNL పెద్ద OTT కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో వినియోగదారులు ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, సోనీలైవ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. BSNL నుండి వచ్చిన ఈ కొత్త FTTH ఆఫర్ కేవలం డేటా ప్లాన్ మాత్రమే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీల మెగా కాంబో. JioFiber, Airtel Xstream వంటి ప్లాన్‌లు అధిక ధరకు పరిమిత డేటాను అందిస్తుండగా.. BSNL మాత్రం కేవలం రూ.625 కు OTT + హెవీ డేటా + లైవ్ టీవీ పూర్తి ప్యాకేజీని అందించడం విశేషం. 

రూ.1 ఫ్రీడమ్ ఆఫర్

సిల్వర్ జూబ్లీతో పాటు.. BSNL తన రూ.1 ప్లాన్‌ను కూడా తిరిగి యాక్టివేట్ చేసింది. ఈ ఆఫర్ ప్రస్తుతం కొత్త కస్టమర్లకు మాత్రమే చెల్లుతుంది. నవంబర్ 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ రూ.1 ప్లాన్‌లో వినియోగదారులు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. 

Advertisment
తాజా కథనాలు