Cheapest Air Cooler: రచ్చ రంబోలా ఆఫర్.. ఎయిర్ కూలర్‌పై భారీ తగ్గింపు.. బుర్రపాడు మచ్చా..!

వేసవి కాలం వచ్చేసింది. బయటకెళ్తే సూర్యుడి భగభగలు.. ఇంట్లో ఉంటే వేడి గాలికి చెమటలు. అందువల్లనే ఈ సీజన్‌లో చాలా మంది ఏసీలు కొనుక్కుంటుంటారు. అయితే వాటి ధరలు అధికంగా ఉండటంతో ప్రత్యమ్నాయంగా చల్లటి గాలినిచ్చే ఎయిర్ కూలర్లు ఎంచుకుంటున్నారు.

New Update
air cooler offers

air cooler offers

వేసవి కాలం వచ్చేసింది. బయటకెళ్తే సూర్యుడి భగభగలు.. ఇంట్లో ఉంటే వేడి గాలికి చెమటలు. అందువల్లనే ఈ సీజన్‌లో చాలా మంది ఏసీలు కొనుక్కుంటుంటారు. అయితే వాటి ధరలు అధికంగా ఉండటంతో ప్రత్యమ్నాయంగా చల్లటి గాలినిచ్చే ఎయిర్ కూలర్లు(summer-air-coolers) ఎంచుకుంటున్నారు. ఇవి తక్కువ ధరతో ఆహా అనేలా చల్లని గాలినిస్తాయి. చాలా మంది వీటినే ఎంచుకుంటున్నారు. ఈ ఎయిర్ కూలర్‌లను కేవలం రూ.5వేలలోపే కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు.  అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read :  ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్.. ఫోన్లు, ఏసీలు సహా సమ్మర్ ప్రొడెక్టులపై భారీ తగ్గింపు..!

Kenstar Air Cooler offer

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌(flipkart-offers) లో Kenstar  Air Cooler చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.12,490 కాగా ఇప్పుడు సగం ధరకే లభిస్తుంది. 54 శాతం తగ్గింపుతో కేవలం రూ.5,799లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై రూ.580 పొందొచ్చు. అలాగే దీనిపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఇంకా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. 

Also Read :  వారెవ్వా.. రూ.4వేలలోపే 90లీటర్ల కొత్త ఫ్రిడ్జ్

Kenstar Air Cooler Specs

కంపెనీ ఈ Kenstar  Air Coolerపై వారంటీని కూడా అందిస్తుంది. మోటార్ అండ్ పంప్‌పై 5 సంవత్సరాలు, అలాగే 1సంవత్సరం కాంప్రహెన్సీవ్ వారంటీని అందిస్తుంది. ఈ ఎయిర్ కూలర్ 45 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. దీనిని ఇంట్లో, బయట కూడా వాడుకోవచ్చు. ఈ కూలర్‌లో హనీకోంబ్ ప్యాడ్స్ వాడటం వల్ల చల్లదనం ఎక్కువగా ఇస్తుంది. తక్కువ కరెంట్‌తో పనిచేస్తుంది. ఈ కూలర్ గట్టి ప్లాస్టిక్‌తో తయారైంది. ఇందులో మూడు రకాల స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. దీనికి చక్రాలు ఉండటం వల్ల ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇందులో వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది. ఇది 5స్టార్ రేటింగ్‌తో వస్తుంది. - cheapest-air-coolers

Advertisment
తాజా కథనాలు