/rtv/media/media_files/2025/07/06/best-power-banks-2025-07-06-14-39-11.jpg)
Best Power Banks
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం అయిపోయింది. చేతిలో మొబైల్ ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు. అయితే ఒక్కోసారి ఎమర్జెన్సీ వర్క్ లో ఉన్నపుడే ఛార్జింగ్ సడెన్ గా అయిపోతుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కరెంట్ సరిగా లేనప్పుడు పవర్‌బ్యాంక్‌ల అవసరం ఎంతగానో ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ఛార్జింగ్ సమస్య లేకుండా చూసుకోవాలనుకుంటే.. ఒక మంచి పవర్‌బ్యాంక్ తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల రూ.1,000 లోపు మంచి క్వాలిటీ, పనితీరు అందించే పవర్‌బ్యాంక్‌లు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ధరకు 10,000mAh, 20,000mAh సామర్థ్యం గల మోడల్‌లు లభిస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Mi (Xiaomi)
Mi (Xiaomi) Power Bankలు వాటి నాణ్యతకు బాగా పాపులర్ అయ్యాయి. దీని ధర సుమారు రూ.800 నుంచి రూ.999 మధ్య ఉంటుంది. ఇది 10,000mAh సామర్థ్యంతో వస్తుంది. దీనికి18W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ ఇన్‌పుట్ (Type-C, Micro USB), డ్యూయల్ అవుట్‌పుట్ (USB-A) పోర్ట్‌లను అందించారు. మెరుగైన బిల్డ్ క్వాలిటీ, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటి 9 లేయర్డ్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటాయి.
boAt EnergyShroom
boAt EnergyShroom పవర్‌బ్యాంక్‌లు మార్కెట్లో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాయి. రూ.1000లోపు 10,000mAh సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్నిసార్లు అదే రూ.1000లకి ఆఫర్‌లలో 20,000mAh మోడల్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది. 2-వే ఫాస్ట్ ఛార్జింగ్, QC 3.0 సపోర్ట్, స్మార్ట్ IC ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను ఇవి కలిగి ఉంటాయి. వీటి ధర సుమారు రూ.799 నుంచి రూ.999 మధ్య ఉంటుంది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
Portronics Power Bank
Portronics వివిధ రకాల పవర్‌బ్యాంక్‌లను అందిస్తుంది. 10,000mAh సామర్థ్యంతో పాటు, కొన్ని మోడల్స్ 20,000mAh సామర్థ్యాన్ని కూడా రూ.1,000 లోపు అందిస్తాయి. అయితే అది ఆఫర్‌లను బట్టి ఉంటుంది. ఇందులో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, టైప్-C PD (Power Delivery) అవుట్‌పుట్, కాంపాక్ట్ డిజైన్‌లు ఉన్నాయి. ధర సుమారు రూ.700 నుంచి రూ.999 మధ్య ఉంటుంది.
Croma Power Bank
క్రోమా.. స్టోర్ల బ్రాండ్ అయినప్పటికీ వాటి పవర్‌బ్యాంక్‌లు మంచి క్వాలిటీ, సామర్థ్యాన్ని అందిస్తాయి. ఇందులో రూ.1000లోపు లభించే Croma Power Bank దాదాపు 10,000mAh సామర్థ్యం, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ధర సుమారు రూ.500 నుంచి రూ.950 మధ్య ఉంటుంది. అది కూడా ఆఫర్లు బట్టి.
వీటి ధరలు ఒక్కోసారి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు ఆన్‌లైన్ లేదా రిటైల్ స్టోర్‌లలో తాజా ధరలు, రివ్యూలను చూసి కొనుక్కోవచ్చు.