IPhone Price Drop: ఆపిల్ దివాళీ సేల్.. రూ.10వేల అరాచకమైన డిస్కౌంట్స్..!

ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్, మ్యాక్‌బుక్, వాచ్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌పై రూ.5వేలు, ఐఫోన్ 16 సిరీస్‌పై రూ.4000, మాక్‌బుక్‌ సిరీస్‌పై రూ.10వేలు, వాచ్‌లపై గరిష్టంగా రూ.6వేల భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

New Update
Apple Diwali Sale

Apple Diwali Sale

దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో షాపింగ్ సందడి జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్‌ కంపెనీలు, షాపింగ్ మాల్స్ పలు ప్రొడెక్టుపై భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలపై డిస్కౌంట్‌లు పొందొచ్చు. ఈ క్రమంలో వరుస పండుగల నేపథ్యంలో ప్రముఖ అమెరికన్ స్మార్‌ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. 

Apple తాజా ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లపై దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఇటీవల లాంచ్ చేసిన iPhone 17 series, MacBookలు, Apple Watch లపై స్పెషల్ ఆఫర్‌లతో భారీ డిస్కౌంట్‌ను పొందుతున్నాయి. iPhone 17, iPhone Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max లను అత్యంత తక్కు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఆపిల్ మాక్‌బుక్‌లపై దాదాపు రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు Apple Diwali Sale గురించి మరింత తెలుసుకుందాం.

IPhone Offers

Apple Diwali Sale సమయంలో IPhone కొనుగోలుపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ప్రయోజనాలను ఆపిల్ అందిస్తోంది. అంతేకాకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసిన చెల్లింపులపై తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. iPhone 17, iPhone Air, iPhone 17 Pro,  iPhone 17 Pro Max కొనుగోలుపై రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. iPhone 16, iPhone 16 Plus, iPhone 16e కొనుగోలుపై రూ.4,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 

అలాగే ఆపిల్ ట్రేడ్-ఇన్ ద్వారా మీరు ప్రస్తుతం యూజ్ చేస్తున్న మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.64,000 ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు కొత్త ఐఫోన్ కొనుగోలుపై 3 నెలల ఆపిల్ మ్యూజిక్ ఉచితంగా లభిస్తుంది. 

Macbook Offers

Apple Macbookపై భారీ ఆఫర్లు ఉన్నాయి. 12 నెలల పాటు నో-కాస్ట్ EMI ప్రయోజనం పొందొచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డులపై తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. MacBook Air 13, 15 పై రూ. 10,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. MacBook Pro 14, 16 పై రూ. 10,000 క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. దీనితో పాటు iMac పై రూ. 5000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. Mac Studio పై రూ. 10,000 క్యాష్‌బ్యాక్, Mac mini పై రూ. 4000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Apple Trade In ద్వారా పాత పరికరాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఎక్స్‌ట్రా పొదుపులు పొందవచ్చు. అలాగే 3 నెలల Apple TV+, Apple Arcade ఉచితంగా లభిస్తాయి.

Apple Watch Offers

Apple Watchపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి Apple Watch కొనుగోళ్లపై తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. Apple Watch Ultra 3 పై రూ.6,000 వరకు, Apple Watch series 11 పై రూ.4,000 వరకు, Apple Watch SE 3 పై రూ.2,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఆపిల్ ట్రేడ్-ఇన్ ఆఫర్‌లతో పాటు నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు