New Smartphone: గేమింగ్ ఫీచర్లు, 7300mAh బ్యాటరీతో కొత్త ఫోన్ పిచ్చెక్కించింది భయ్యా..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన లైనప్‌లో ఉన్న మరొక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా OnePlus 15ను లాంచ్ చేసింది. OnePlus 14 ను పక్కనపెట్టి.. కంపెనీ OnePlus 13 తర్వాత నేరుగా OnePlus 15 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Update
OnePlus 15 launched

OnePlus 15 launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన లైనప్‌లో ఉన్న మరొక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా OnePlus 15ను లాంచ్ చేసింది. OnePlus 14 ను పక్కనపెట్టి.. కంపెనీ OnePlus 13 తర్వాత నేరుగా OnePlus 15 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్‌ స్పెసిఫికేషన్లలో అనేక ప్రధాన అప్‌గ్రేడ్‌లు చేశారు. కొత్త OnePlus 15 అధిక-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ చిప్‌సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు OnePlus 15 ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

OnePlus 15 Price

OnePlus 15 బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 50,000 నుండి ప్రారంభమవుతుంది. 

16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 53,100.

12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 57,000.

16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 60,600. 
టాప్-ఎండ్ వేరియంట్ 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 66,700గా కంపెనీ నిర్ణయించింది.

OnePlus 15 కొత్త సాండ్ డ్యూన్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. అబ్సొల్యూట్లీ బ్లాక్, మ్యాట్ పర్పుల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ అక్టోబర్ 28న చైనాలో సేల్‌కు వస్తుంది.

OnePlus 15 specifications

OnePlus 13 తో పోలిస్తే OnePlus 15 కెమెరా మాడ్యూల్ డిజైన్ పూర్తిగా మారింది. OnePlus 15.. 6.78-అంగుళాల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1 - 165Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారుతుంది. 1800 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఇది BOE ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED ప్యానెల్‌తో వస్తుంది. 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌కు మద్దతు ఇస్తుంది.

OnePlus 15 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. Android 840 GPU, 16GB వరకు గరిష్ట RAM + 1TB వరకు గరిష్ట స్టోరేజ్‌ను కలిగి ఉంది. OnePlus 15 ఫోన్ Android 16-ఆధారిత Color OS 16పై నడుస్తుంది. ఈ ఫోన్ కొత్త ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 

OnePlus 15లో OIS తో 50MP ప్రధాన వెనుక కెమెరా ఉంది. OIS-సపోర్ట్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. OnePlus 15 లో 8K రిజల్యూషన్ వరకు వీడియోను రికార్డ్ చేయగల హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ సిస్టమ్ కూడా ఉంది. ముందు భాగంలో 32MP షూటర్‌ను కలిగి ఉంది. 

OnePlus 15లో మరో ముఖ్యమైనది దాని పెద్ద బ్యాటరీ. ఈ ఫోన్ 7,300mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది మాగ్నెట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు