New Smartphone: మోటో నుంచి బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు యమ అదుర్స్..!

మోటరోలా తన Moto X70 Airను విడుదల చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది.

New Update
Moto X70 Air launched

Moto X70 Air launched

మోటరోలా తన ఎయిర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Moto X70 Airను విడుదల చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto X70 Air 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇప్పుడు Moto X70 Air ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

Moto X70 Air Price

Moto X70 Air 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 32,205గా ఉంది. అలాగే 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,925గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. అక్టోబర్ 31 నుండి చైనాలో అమ్మకానికి వస్తుంది. ఇది గాడ్జెట్ గ్రే, లిల్లీ ప్యాడ్, బ్రాంజ్ కలర్‌లలో లభిస్తుంది. 

Moto X70 Air Specifications

Moto X70 Airలో 6.7-అంగుళాల 1.5K 10-బిట్ pOLED డిస్‌ప్లే 2712x1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షించబడింది. ఇది అడ్రినో 722 GPUతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 (4nm) ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB/512GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. Moto X70 Air ఆండ్రాయిడ్ 16పై నడుస్తుంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4800mAh బ్యాటరీతో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Moto X70 Air వెనుక భాగంలో f/1.8 ఎపర్చరు, OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం MIL-STD-810H సర్టిఫైడ్ చేయబడింది. కనెక్టివిటీ ఎంపికలలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు