Amazon Mobile Offers: అమెజాన్ బంపర్ సేల్.. శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐక్యూ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్‌‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. Samsung Galaxy A55 5G రూ.25,999, iQOO Z10 5G రూ.22,998, iQOO Neo 10R 5G రూ.28,998, OnePlus Nord CE 5 రూ.23,499లకు సొంతం చేసుకోవచ్చు.

New Update
amazon great freedom festival sale 2025

amazon great freedom festival sale 2025

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazon Great Indian Festival Sale 2025లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో సహా వివిధ ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా పొందవచ్చు. ముఖ్యంగా అమెజాన్ సేల్‌లో.. శామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy A55 5G

 ఇందులో దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung Galaxy A55 5G రూ.45,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 43 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో దీనిని కేవలం రూ.25,999కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అలాగే క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. రూ.24,050 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటన్నింటితో Samsung Galaxy A55 5G ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. 

iQOO Z10 5G

దీనితో పాటు iQOO Z10 5G అసలు ధర రూ.27,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.22,998కి అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాంక్ తగ్గింపులు ఉన్నాయి. అలాగే రూ.21,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు iQOO Z10 5Gని మరింత తక్కువకే కొనుక్కోవచ్చు

iQOO Neo 10R 5G 

iQOO Neo 10R 5G అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. దీని అసలు ధర రూ.35,999 ఉండగా.. ఇప్పుడు 19 శాతం డిస్కౌంట్‌తో రూ.28,998లకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో కస్టమర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం (రూ.1250) వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో కస్టమర్లు నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. 

వీటితో పాటు OnePlus Nord CE 5 అసలు ధర రూ.24,999 కాగా ఇప్పుడు రూ.23,499లకు కొనుక్కోవచ్చు. అలాగే iQOO Z10R 5G అసలు ధర రూ.24,999 ఉండగా.. ఇప్పుడు రూ.21,498లకు సొంతం చేసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు