/rtv/media/media_files/2025/08/03/amazon-mobile-offers-2025-08-03-15-06-17.jpg)
Amazon Mobile Offers
కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తరచూ కొత్త కొత్త సేల్స్ ప్రకటిస్తూ ఉంటాయి. అందులో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ సహా మరెన్నో వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ రెండు సంస్థ పలు సేల్స్‌తో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అమెజాన్ మరొక అదిరిపోయే సేల్‌ను తీసుకొచ్చింది.
amazon great freedom festival sale 2025
‘‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025’’ ప్రకటించింది. ఈ సేల్‌లో ఇప్పుడు ఆఫర్ల వర్షం మొదలైంది. ఈ సేల్‌లో రూ.25 వేలకు లభిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లపై లభించే డీల్స్, ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం. వీటిలో iQOO Z10 5G, Honor 200 5G, Realme Narzo 80 Pro 5G, OnePlus Nord CE5, Motorola Edge 50 Fusion 5G వంటి ఫోన్లు ఉన్నాయి. వీటిని ఈ సేల్ సమయంలో ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. రూ.25 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌లపై లభించే ఆఫర్‌లు, డీల్స్ గురించి తెలుసుకుందాం.
iQOO Z10 5G
iQOO Z10 5G మొబైల్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.23,998 కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో.. SBI క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పై ఫ్లాట్ రూ.1250 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.22,748కి లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.22,750 ఆదా చేసుకోవచ్చు.
Honor 200 5G
Honor 200 5G స్మార్ట్‌ఫోన్‌లోని 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం జూలైలో రూ.39,999కి లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.21,698 కి లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.20,698కి లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.20,500 ఆదా చేసుకోవచ్చు.
Realme Narzo 80 Pro 5G
Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లోని 12GB + 256GB వేరియంట్ అమెజాన్ సేల్‌లో రూ.22,498 కి అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ.475 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.21,523కి కొనుక్కోవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.21,000 ఆదా చేసుకోవచ్చు.
Motorola Edge 50 Fusion 5G
Motorola Edge 50 Fusion 5G స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.21,689 కు లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.20,689కి కొనుక్కోవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.21,000 ఆదా చేసుకోవచ్చు.
OnePlus Nord CE5
OnePlus Nord CE5 మొబైల్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ Amazonలో రూ.24,998 కి లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.23,998కి కొనుక్కోవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.23,650 ఆదా చేసుకోవచ్చు.