/rtv/media/media_files/2025/09/13/amazon-great-indian-festival-sale-1-2025-09-13-07-45-48.jpg)
amazon great indian festival sale
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో త్వరలో Amazon Great Indian Festivel Sale ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం అతిపెద్ద సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ మెంబర్స్ ఒక రోజు ముందుగానే ఈ సేల్‌కు యాక్సెస్ పొందుతారు. అంటే వారు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్స్ పొందుతారు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Amazon Great Indian Festivel Sale మైక్రోసైట్ కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ సేల్‌లో అనేక ఆఫర్‌లు ఉండనున్నట్లు తెలిపింది. అయితే కంపెనీ ఇంకా ఆఫర్‌లను వెల్లడించలేదు. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, EMI ఎంపికలు ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పుడు దాని వివరాలను తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్లపై ప్రత్యేక డీల్స్?
Amazon Great Indian Festivel Saleలో మొబైల్ ఫోన్లపై అనేక ఆఫర్లు అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆఫర్లను కంపెనీ సెప్టెంబర్ 17న వెల్లడిస్తుంది. ఈ సేల్‌లో కస్టమర్లు ముఖ్యంగా Samsung Galaxy S24 Ultraను అత్యంత తక్కువకే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ సగం కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.
దీనితో పాటు iPhone 15 పై అదిరిపోయే డీల్ పొందుతారు. కంపెనీ దీనిని రూ.50 వేల కంటే తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది. iPhone, Samsung మాత్రమే కాకుండా.. OnePlus 13R, iQOO Neo 10R, Redmi A4, Realme Narzo 80 Lite 5G సహా ఇతర ఫోన్‌లపై డిస్కౌంట్లను పొందుతారు.
ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై డిస్కౌంట్లు
Amazon Great Indian Festivel సేల్‌లో మీరు Samsung Galaxy S25 Ultra 5G, S24 Ultra 5G, Xiaomi 15 Ultra, iQOO 13, iPhone 15, OnePlus 13s, OnePlus 13R వంటి హై-ఎండ్ ఫోన్‌లను చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కాగా ఫోన్లు మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్‌లను కూడా అత్యంత తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఉత్పత్తులన్నింటిపై ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందుతారు.
Amazon Great Indian Festivel సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు 40 శాతం తగ్గింపుతో లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. టీవీలు, ఇతర పెద్ద గృహోపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా ఈ సేల్ నుండి సగం ధరకు అమెజాన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.