/rtv/media/media_files/2025/07/26/amazon-great-freedom-festival-2025-sale-2025-07-26-21-43-18.jpg)
Amazon Great Freedom Festival 2025 Sale
అమెజాన్ మరొక అద్భుతమైన సేల్‌ను ప్రకటించింది. ఇటీవలే ప్రైమ్ సేల్‌తో కస్టమర్లను ఆకట్టుకున్న అమెజాన్ ఇప్పుడు Amazon Great Freedom Festival 2025 Sale తేదీలను అధికారికంగా వెల్లడించింది. ఈ సరికొత్త సేల్ ఆగస్టు 1 నుండి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా అంటే ఆగస్టు 1 అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Amazon Great Freedom Festival 2025 Sale
మిగతా వినియోగదారులందరికీ ఇది మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రతి సంవత్సరం లాగే అమెజాన్ ఈసారి కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, కిరాణా వంటి అనేక ప్రొడెక్టులపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లు, ప్రత్యేకమైన డీల్‌లు లభిస్తాయి. ప్రతిసారి లాగే ఈసారి కూడా బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
Amazon Great Freedom Festival starts August 1st. pic.twitter.com/amzC25qVwA
— Mukul Sharma (@stufflistings) July 24, 2025
SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే.. 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే కొన్ని ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్, రోజువారీ "ట్రెండింగ్ డీల్స్" వంటి ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ కోసం కస్టమర్లు తమ విష్ లిస్ట్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. తద్వారా ఆఫర్ల సమయంలో బెస్ట్ డీల్‌లను త్వరగా ఆర్డర్ చేసుకోవడానికి సహాయపడుతుంది.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
అమెజాన్ ప్రకారం.. ఈసారి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అత్యధిక ఆఫర్‌లు ఉంటాయి. Samsung, Apple, OnePlus, Xiaomi వంటి బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండే ఛాన్స్ ఉంది. దీనితో పాటు గృహోపకరణాలు, టీవీలపై 65% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్, బ్యూటీ, కిరాణా, గృహోపకరణాలపై కూడా అనేక ప్రత్యేకమైన ఆఫర్‌లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.