Tech Tips: ఈ 7 మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను ఈజీగా బుట్టలో వేసుకునేందుకు, వారికి ఆశ చూపుతు వాట్సాప్, మెసేంజర్స్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేశారో మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. అందుకే గుర్తు తెలియని లింక్స్‌ క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

Tech Tips: ఈ 7 మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..!
New Update

7 Fake Messages: భద్రతా సంస్థ మెకాఫీ (McAfee) ఇటీవల గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీని విడుదల చేసింది. ఈ నివేదిక.. స్మార్ట్‌ఫోన్(Smart Phone) వినియోగదారులందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ నేరగాళ్లు ప్రజల మొబైల్స్, ఇతర డివైజ్‌లను హ్యాక్ చేయడానికి కొత్త ట్రిక్స్ ఫాలో అవుతున్నట్లు నివేదికలో పేర్కొంది. ప్రజల్లో ఆశను రెకెత్తించే సందేశాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపి చోరికి పాల్పడుతున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఎస్ఎంఎస్ (SMS), వాట్సాప్ (WhatsApp) లలో వచ్చే 7 ప్రమాదకరమైన మెసేజ్‌లను లిస్ట్ చేకసింది మెకాఫీ. 82 శాతం మంది భారతీయులు ఇలాంటి ఫేక్ మెసేజ్‌లపై క్లిక్ చేసి.. బాధితులుగా మారుతున్నారని నివేదిక పేర్కొంది. భారతీయులు ప్రతి రోజూ ఈమెయిల్, టెక్ట్స్, సోషల్ మీడియా ద్వారా దాదాపు 12 నకిలీ మెసేజ్‌లను, స్కామ్‌ మెసేజ్‌లను అందుకుంటున్నారు. అందుకే.. ఇలాంటి మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయొద్దని చెబుతున్నారు నిపుణులు. మరి క్లిక్ చేయకూడని ఆ 7 మెసేజ్‌లు ఏంటో ఓసారి చూద్దాం..

గిఫ్ట్ గెలుచుకున్నారు!..

మీరు గిఫ్ట్ (Gifts) గెలుచుకున్నారంటూ మీ ఫోన్లకు మెసేజ్, వాట్సాప్, మెయిల్ రూపంలో మెసేజ్‌లు వస్తుంటాయి. కానీ, ఇలాంటి వాటిలో 99 శాతం ఫేక్ మెసేజ్‌లే ఉంటాయని నివేదిక పేర్కొంది. స్కామర్లు తెలివిగా ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం ఇది అని నివేదికలో పేర్కొన్నారు.

జాబ్ నోటిఫికేషన్స్, ఆఫర్స్..

ఇది మరో ప్రమాదకరమైన మెసేజ్. జాబ్ ఆఫర్లు (Job Offers) వాట్సాప్, ఎస్ఎంఎస్ లో రావు. ఏ ప్రొఫెషనల్ కంపెనీ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో జాబ్స్ కోసం వ్యక్తులను సంప్రదించవు. ఇలాంటి మెసేజ్‌లు మీ మొబైల్‌కి వచ్చినట్లయితే.. అది ఖచ్చితంగా స్కామ్ అయి ఉంటుంది.

యూఆర్‌ఎల్ లింక్స్‌తో బ్యాంక్‌ వార్నింగ్ మెసేజ్‌లు..

మెసేజ్‌లోని URL/లింక్స్ ద్వారా కేవైసీని పూర్తి చేయాలని కోరుతూ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా మెసేజ్ వస్తే.. అది ఖచ్చితంగా స్కామ్ అయి ఉంటుంది. డబ్బులను దొంగిలించడమే లక్ష్యంగా స్కామర్లు పంపే లింక్స్ ఇవి. వీటిని అస్సలు క్లిక్ చేయొద్దు.

మీరు కొనుగోలు చేయని వాటి గురించి సమాచారం..

మీరు చేయని కొనుగోలుకు సంబంధించిన ఏవైనా అప్‌డేట్స్ వస్తే అలర్ట్ అవ్వాలి. వీటిపై క్లిక్ చేయొద్దు. లేదంటే.. మీ ఫోన్‌ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Netflix, ఇత OTT సబ్‌స్క్రిప్షన్ అప్‌డేట్స్..

OTT ప్లాట్‌ఫారమ్‌కి జనాదరణ పెరగడంతో, స్కామర్‌లు నెట్‌ఫ్లిక్స్ లేదా ఇతర OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఫ్రీ అంటూ మెసేజింగ్‌లు పంపుతూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

ఫేక్ మిస్డ్ డెలివరీ, నోటిఫికేషన్స్..

పొరపాటున ప్రోడక్ట్, ఇతర వస్తువుల తప్పుడు అడ్రస్‌కి డెలివరీ అయినట్లు మెసేజ్‌లు, వాట్సాప్ నోటిఫికేషన్ పంపుతుంటారు కేటుగాళ్లు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

అమెజాన్ సెక్యూరిటీ అలర్ట్స్ పేరుతో మెసేజ్‌లు..

మీ అమేజాన్ సెక్యూరిటీ అలర్ట్‌ పేరుతో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు వస్తే రెస్పాండ్స్ అవ్వొద్దు. సెక్యూరిటీ అలర్ట్స్ కోసం అమేజాన్ ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలను పంపించదు. ఇవి సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకునేందుకు పంపే స్కామ్ మెసేజ్‌లు. వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read:

టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!

#rtvlive-com #cyber-crime #fake-messages #cyber-tips #fraud-messages
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe