Tech Mahindra : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిసక్తే నికర లాభం క్షీణించిందని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41 శాతం తగ్గి రూ.661 కోట్లుగా నమోదైంది.

Tech Mahindra : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్
New Update

IT Company Tech Mahindra : ఐటీ కంపెనీ(IT Company) టెక్ మహీంద్రా(Tech Mahindra) కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో రూ.661 కోట్ల నికర లాభం వచ్చింది. ఐతే గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే అని చెబుతున్నారు టెక్ మహీంద్రా సీఈవోలు మోహిత్ జోషి(Mohit Joshi), రోహిత్ ఆనంద్‌(Rohit Anand) లు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది లాబాల్లో 41 శాతం క్షీణించిందని తెలిపారు. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,117.7 కోట్లుగా ఉండగా.. ఈ ఇయర్ కంపెనీ ఆదాయం 6.2 శాతం కుంగి రూ.12,871 కోట్లకు పరిమితమైందని చెప్పారు.

ఇక మూడో త్రైమాసికం ముగిసేసరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గింది. అంతకు ముందు 1, 46, 250 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పుడు 1, 45, 455కు పడిపోయింది. దాంతో పాటూ 2023 ఆర్ధిక సంవత్సరంలో టెక్ మహీంద్రా నికర లాభం 51.2 శాతం తగ్గి 2, 358 కోట్లకు చేరింది. దీని వల్ల కంపెనీ ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 51,996 కోట్లు గా ఉంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌గా రూ.5 విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.28 తుది డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డుకు సిఫార్సు చేసింది. 2023 నవంబరులో కంపెనీ చెల్లించిన రూ.12 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈ(NSE) లో 0.43 శాతం పెరిగి రూ.1,190.75 వద్ద స్థిరపడింది.

ఫ్రెషర్ల నియామకం...

కంపెనీ ఆదాయం, లాభ-నష్టాల విషయం పక్కన పెడితే ఎప్పటిలానే ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ మాత్రం నిర్వహిస్తామని చెబుతున్నారు టెక్ మహీంద్రా సీఈవోలు మోహిత్, రోహిత్. మొత్తం 6000 మంది ఫ్రెషర్లను నియమిస్తామని తెలిపారు. దీని కోసం క్యాంపస్‌లకు వెళతామని అన్నారు. ప్రతీ త్రైమాసికంలో 1500 గ్రాడ్యుయేట్లను చేర్చుకుంటున్నామని...ఇప్పుడుకూడా అదే ఫాలో అవుతామని తెలిపారు రోహిత్ ఆనంద్. దాంతో పాటూ కంపెనీ ఈ ఏడాదిలో 50 వేల మంది ఉద్యోగులకు కృత్రిమ మేథస్సుపై శిక్షణ ఇవ్వడానికి రెడీ అయిందని తెలిపారు. దీనివలన 2026-27 ఆర్ధిక సంవత్సరానికి కంపెనీ టాప్‌లైన్ వృద్ధిని అధిగమించడంలో సహాయపడుతుందని చెప్పారు.

Also Read:Supreme Court: ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు పై నేడు సుప్రీం తీర్పు!

#tech-mahindra #recruitment #income #it-company
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe