Team India Captaincy : టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup-2024) ముగిసింది. పొట్టి ఫార్మెట్‌లో టీమిండియా (Team India) విశ్వవిజేతగా అవతరించింది. 17ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 సంగ్రామంలో భారత్ ట్రోఫీ గెలిచింది. గతేడాది(2023) వన్డే ప్రపంచకప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం సత్తా చాటింది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే అటు కోహ్లీ (Virat Kohli) ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. నిజానికి ఈ టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఈ ఇద్దరు ఈ ఫార్మెట్‌కు వీడ్కోలు పలుకుతారని విశ్లేషకులు ముందే ఊహించారు. ఇక గెలుపుతో ఆ ముగింపు రావడంతో ఫ్యాన్స్ కూడా ఆనందపడుతున్నారు. ఇదే క్రమంలో టీమిండియాకు కాబోయే టీ20 కెప్టెన్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కెప్టెన్సీ రేసులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు.
హార్దిక్ పాండ్యా:
టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా భారత కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. టీ20 వరల్డ్‌కప్-2024లో పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. ఇటు 2022, 2023లో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గానూ రాణించాడు. 2022 సీజన్‌లో పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటిల్ గెలవగా.. 2023 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
జస్ప్రీత్ బుమ్రా:
భారత క్రికెట్ బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా పని చేయడం బుమ్రా నైజం. ఇదే అతడిని ఎవరికి అందనంత ఎత్తులో నిలబెట్టింది. టీమిండియాకు మూడు ఫార్మెట్లలో మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్న బుమ్రకు టీ20 కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.
సూర్యకుమార్ యాదవ్:
టీ20 కెప్టెన్సీకి పోటి పడుతున్న వారిలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ టీ20 స్పెషలిస్ట్‌గా మంచి పేరు సంపాదించాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహారించాడు.
రిషబ్ పంత్:
రిషబ్ పంత్ పేరు కూడా పోటీ లిస్ట్‌లో ఉంది. ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవంతో పంత్ రేసులో ఉన్నాడు. అయితే పాండ్యా, బుమ్రా, సూర్యభాయ్‌తో పోల్చితే పంత్‌కు కెప్టెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.
Also Read: టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!