Team India : ఒక్క విజయం.. రెండు మహా నిష్క్రమణలు.. బహుశా టీమిండియా చరిత్రలో ఇలాంటి రోజు ఇప్పటివరకూ చూసి ఉండదు. ఒక పక్క ఘనవిజయం తెచ్చిన సంబరాలు మొదలవుతూనే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) తన టీ20 కెరీర్ కు ఇది చివరి మ్యాచ్ అని చెప్పేశాడు. ఆ విషయాన్ని అభిమానులు అర్ధం చేసుకునే లోపులోనే.. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేడేళ్ల ఎదురుచూపుల తరువాత దక్కిన ట్రోఫీని భారత జట్టు ముద్దాడుతున్న ఆనందం కంటే.. ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి ఈ ఫార్మేట్ నుంచి పక్కకు జరిగిపోతున్నారన్న బాధ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే భారత క్రికెట్ చరిత్రలో జూన్ 29 ఒక అద్భుతమైన పేజీగా మిగిలిపోతుంది.
పూర్తిగా చదవండి..Rohit and Kohli : టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!
టీమిండియా అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు టీ20 ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. వారి నిష్క్రమణ ఒకవైపు.. విజయోత్సవాలు మరోవైపు టీమిండియా అభిమానుల్లో చెప్పలేని ఎమోషన్ తెచ్చాయి. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ ఇద్దరి ప్రయాణం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: