Team India Captaincy : టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup-2024) ముగిసింది. పొట్టి ఫార్మెట్లో టీమిండియా (Team India) విశ్వవిజేతగా అవతరించింది. 17ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 సంగ్రామంలో భారత్ ట్రోఫీ గెలిచింది. గతేడాది(2023) వన్డే ప్రపంచకప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం సత్తా చాటింది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే అటు కోహ్లీ (Virat Kohli) ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. నిజానికి ఈ టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఈ ఇద్దరు ఈ ఫార్మెట్కు వీడ్కోలు పలుకుతారని విశ్లేషకులు ముందే ఊహించారు. ఇక గెలుపుతో ఆ ముగింపు రావడంతో ఫ్యాన్స్ కూడా ఆనందపడుతున్నారు. ఇదే క్రమంలో టీమిండియాకు కాబోయే టీ20 కెప్టెన్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కెప్టెన్సీ రేసులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Next India Captain : టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే?
వరల్డ్‌కప్ ఫైనల్ విక్టరీ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో అందరికంటే ముందుగా హార్దిక్‌పాండ్యా, బుమ్రా ఉన్నారు. అటు సూర్యకుమార్, పంత్‌లను బీసీసీఐ కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం.
Translate this News: