పోరాడదామని డిసైడ్ అయ్యాక ఎన్ని అవమానాలనైనా భరిద్దాం- నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.

New Update
పోరాడదామని డిసైడ్ అయ్యాక ఎన్ని అవమానాలనైనా భరిద్దాం- నారా లోకేశ్

టీడీపీ శాసనసభా పక్షం ఈరోజు సమావేశం అయింది. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దీనిలో టీడీఎల్పీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రేపటి నుంచి మొదలయ్యే ఏపీ శాశససభా సమావేశాలకు తమ పార్టీ హాజరు కావాలని టీడీపీ నిర్ణయించుకుంది. గురువారం నుంచి ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాలలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని తెలిపింది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, తరువాత రాష్ట్రంలో పరిణామాల మీద నేతలు చర్చించారు. ఈ సమావేశంలో లోకేశ్ తో పాటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు.

పోరాడదాం అని నిర్ణయం తీసుకున్నాక దాని కోసం శ్రీన్ని అవమానాలనైనా భరిద్దాం అన్నారు నారా లోకేశ్. చంద్రబాబు అరెస్ట్ తో పాటూ రాష్ట్రంలో ఉన్న పలు సమస్యల మీద శాశనసభలో మాట్లాడాలని...ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని ఆయన అన్నారు. అందుకే అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కావాలని టీడీపీ నేతలకు లోకేశ్ సూచించారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో...వీధుల్లో చేయాల్సింది వీధుల్లో చేద్దామని పిలుపునిచ్చారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను ఆపొద్దని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అక్కమం అనే విషయాన్ని శాశనసభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పారు.

సభలో మైక్ ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దాం అన్నారు లోకేశ్. జగన్ అవినీతిని ప్రజల సమక్షంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఒక్కరే కాదు ఆయన తర్వాత కూడా పలు అరెస్ట్ లు ఉంటాయనే ప్రచారం జరుగుతుండడంతో...దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో, బయట ఎలా ప్రవర్తించాలన్న దాని మీద పయ్యావుల కేశవ్ మాట్లాడారు. పార్టీ కార్యచరణను సూచించారు.

ఈ అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ బిల్లులపై చర్చ జరగనుంది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. అన్నమయ్య జిల్లాలోని అంగళ్ళు ఘర్షణల కేసులో చంద్రబాబు మీద పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆయన తరఫున లాయర్స్. ఈరోజు బాబు బెయిల్ మీద ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు