Nara Lokesh: తెలుగు దేశం పార్టీని తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 'శంఖారావం' పేరుతో జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఈ రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో పాల్గొన్నారు లోకేష్. ఈ సభలో వైసీపీ అధినేత సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.
ALSO READ: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మేం కుర్చీలు మడతపెడతాం...
పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్‌కు భయం అని అన్నారు. రైతులను చూస్తే జగన్‌కు భయమేస్తోందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీకి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే మంచిదని.. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని అన్నారని తెలిపారు. మూడు రాజధానులు అన్న వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? అని నిలదీశారు.
అన్ని పెంచిర్రు..
2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచిందని చురకలు అంటించారు. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి క్యాలెండర్ తప్ప.. జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా? ఈ ప్రభుత్వం అని నిలదీశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం పగలగొట్టడం విచారకరం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విగ్రహాలు పగలగొట్టిన వారిని పట్టుకుంటాం అని స్పష్టం చేశారు.
ALSO READ: త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం