వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధిస్తోందని ఫైర్ అయ్యారు. జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణ రెడ్డి (Sajjala Ramakrishna Reddy).. నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆవేదనను అవహేళన చేయడం బాధాకరమన్నారు. సజ్జలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో విషాదం..ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
సజ్జల అక్రమాలను బయటపెడతాం
సజ్జల సీఎంవోలో అధికారం ఉందని హద్దుదాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం (TDP government) వచ్చాక.. సజ్జల అక్రమాలను బయటపెడతాం అని హెచ్చరించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ప్యాకేజీ లీడర్ అంటూ విమర్శలు చేశారు. సీఎం జగన్ (CM Jagan) దగ్గర ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుపై కేసులు వేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్యాకేజిలు తీసుకున్న ఘనత ఉండవల్లి అరుణ్‌కే చెల్లుతుందని ఆరోపణలు గుప్పించారు. సజ్జల, ఉండవల్లి, కొడాలి నానికి పిచ్చి పరాకాష్టకు చేరిందని బుద్దా వెంకన్న ఆరోపించారు. అర్జెంట్‌గా రేబీస్ ఇంజక్షన్ చేయాలంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు హాని జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.
ఇది కూడా చదవండి: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు
హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయాలి డిమాండ్
చంద్రబాబుకు పలు ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ అడిగినా పోలీసులు ససేమిరా అంటున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్సీపీ నేతల (YSRCP leaders) ఒత్తిడితోనే హెల్త్ బులిటెన్ రిలీజ్ (Health Bulletin Release) చేయట్లేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: బార్బీ బొమ్మలా హీరోయిన్ సమంత ఫోజులు