AP Elections: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు. By B Aravind 30 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి TDP-Janasena-BJP Manifesto: ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌కు (TDP Super Six) అదనంగా జనసేన-బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు కలిపి మేనిఫెస్టోను రూపొందించారు. ఇటీవల సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది రాష్ట్రం ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మేనిఫెస్టో ప్రధాన అంశాలు ఇవే 1.మెగా డీఎస్సీపై తొలిసంతకం హామీ ఉండొచ్చని ప్రచారం 2.వృద్ధాప్య పింఛన్ రూ.4వేలకు పెంపు 3. దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంపు 4. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 5. అలాగే మహిళలకు నెలకు 1500ఆర్థిక సాయం 6. ఏటా ఫ్రీగా మూడు సిలిండర్లు హామీలు ఉండే అవకాశం 7. యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన 8. జాబ్ వచ్చే వరకు 3వేల నిరుద్యోగ భృతి 8. తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు జమ 9. అలాగే రైతులకు ఏటా పెట్టుబడి సాయం కింద రూ.20వేలు 10. వాలంటీర్లకు నెలకు రూ.10వేల చొప్పున గౌరవ వేతనం 11. అన్నా క్యాంటీన్లు, ఉచిత ట్యాప్ కనెక్షన్ 12. బీసీ రక్షణ చట్టం, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ 13. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం, విదేశీ విద్యా దీవెన వంటి హామీలు కూటమి మేనిఫెస్టోలో ఉండే అవకాశం Also Read: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ #pawan-kalyan #telugu-news #chandrababu #ap-elections-2024 #tdp-janasena-bjp-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి