టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 44 రోజులు గడిచాయి. బాబు అరెస్ట్ అయిన రెండో నాడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ తెలిపారు.
ఎక్కడైతే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయో అక్కడి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు.
Also read: ఎన్నికలు తరుముకోస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్..రాజీనామా చేసిన నటి!
ఇరు పార్టీల నుంచి కూడా సుమారు 14 మంది కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. ఆదివారం రాత్రే రాజమండ్రికి చేరుకున్న లోకేష్, బ్రహ్మణి. సోమవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబుతో ములాకత్ కానున్న కుటుంబ సభ్యులు. చంద్రబాబు జైలు నుంచి లేఖ విడుదల చేశారు అనేది అవాస్తవమని జైలు అధికారులు తెలిపారు.
జైలు నుంచి ఏదైనా లేఖ బయటకు వస్తే దాని కింద సంబంధిత అధికారి సంతకం ఉంటుందని పేర్కొన్నారు. బాబు కేవలం కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే లేఖ విడుదల చేస్తారని వివరణ. ఉమ్మడి రాజకీయ కార్యాచరణకు పిలుపును ఇవ్వనున్న కార్యాచరణ కమిటీ. రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా భేటీ అవుతున్న కార్యాచరణ కమిటీ. సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేసిన జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు.
జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ కమిటీ భేటీ పై ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠ. మధ్యాహ్నం ఒంటిగంటకు మధురపూడి ఎయిర్ పోర్ట్ కు భారీ ఎత్తున చేరుకోనున్న జనసేన కార్యకర్తలు. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా రాజమండ్రి మంజీరా హోటల్ కు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అటు జైలులో చంద్రబాబు.... ఇటు జైలు బయట ఎదురుగా ఉన్న హోటల్ లో పవన్ కళ్యాణ్ , లోకేష్ భేటీ.
Also read: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించిన కమిటీ. ఉమ్మడిగా ఉద్యమాలు కొనసాగిస్తూనే... ఎవరికివారు పార్టీలపరంగా ప్రజల్లోకి దూసుకెళ్లే యోచన. టీడీపీ, జనసేన పొత్తులతో వైసీపీలో వణుకు ప్రారంభమైందంటున్న ఆ పార్టీ నేతలు.
ఓట్లు, సీట్లు, పదవులు పక్కనపెట్టి పోరాటమే ప్రధాన లక్ష్యంగా, వైసీపీని గద్ది దించాలంటూ ఇరు పార్టీలు ప్రకటన. టీడీపీ జనసేన పొత్తులను జీర్ణించుకోలేక కార్యకర్తలను వైసీపీ నేతలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపణ ఏది ఏమైనా రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భవిష్యత్తు పోరాటాలకు రాజమండ్రి వేదికగా రాజకీయ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు.