TDP Chief Chandra Babu: వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టుకుండా నాలుగేళ్లుగా పక్కన పెట్టారంటూ ఇవాళ అయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అత్యాశ, అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములిచ్చిన వేల మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
టీడీపీ అధికారంలోకి రాగానే కేవలం మూడు నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృథా కాదని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసానిచ్చారు. అక్రమ మైనింగ్ తో జనావాసాల్లోకి ఏనుగులు.. అక్రమ మైనింగ్ చేపట్టడంతో జనావాసాల్లోకి ఏనుగులు వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడులను అరి కట్టాలని లేఖలో కోరారు. అక్రమ మైనింగ్ తో అవి జనావాసాల్లోకి వస్తున్నాయని, ఏనుగుల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!