సైకో టైమ్ అయిపోయింది.. నా ఉగ్రరూపం చూపిస్తా: చంద్రబాబు

సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని..

New Update
Chandra Babu: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు!

సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల్ని అందుకుని ఉంటే విస్తీర్ణం తగ్గేది కాదన్నారు. ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవన్నారు, నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చనని తెలిపారు.

సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌ కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీర్చిన తరువాతే చెన్నైకి నీరిస్తమని ఆనాడు ఎన్టీఆర్ (NTR) తేల్చి చెప్పారని చంద్రబాబు అన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీయేనన్నారు. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ ఎత్తిపోతల ద్వారా రాయల సీమ నెల్లూరుకు నీళ్లు అందించామన్నారు. వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీలు తీసుకొస్తే మొత్తం 250 టీఎంసీ నీరు రాయలసీమ, నెల్లూరుకు ఇవ్వవచ్చునన్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.

టీడీపీ హయాంలో హైలెవల్ కెనాల్, ప్రాజెక్టులు ఇరిగేషన్ పనులు 70 నుండి 80 శాతం పూర్తి చేశామని, కానీ వైసీపీ మిగిలిన శాతాన్ని పూర్తి చేయలేకపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. నెల్లూరు, సంగం ప్రాజెక్టులు 17, 20 శాతం పనులు పూర్తి చేసి పేర్లు పెట్టుకుంటున్నారు.. కానీ బ్యారేజీలు నీటి సరఫరా చేయలేక చేతులెత్తేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కోసం రూ.5,300 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక అడ్డంకులు తర్వాత పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశామని, ఈ వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని రివర్స్ రెండరింగ్ ద్వారా పోలవరం నత్తనడకన సాగుతోందని విమర్శించారు.

పోలవరం డయాఫామ్ వాల్ దెబ్బతిన్నదని, అప్పర్ కాపర్ డ్యామ్, గైడ్ బండ్ లు దెబ్బతిన్నాయన్నారు. అనుభవం, అవగాహన లేని ముఖ్యమంత్రి తీరు వలన జరుగుతున్న నష్టం చూస్తుంటే బాదేస్తుందని చంద్రబాబువ అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఏకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని చంద్రబాబు అన్నారు. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఒకప్పుడు నరకం చూశామని, దేశంలో మొదటి సారిగా చెన్నై టూ ఆంద్రప్రదేశ్ జాతీయ రహదారి చేపట్టిన ఘనత ఉందన్నారు.

పేటీఎం బ్యాచ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతోందని, టీడీపీ పాలనలో ఇరిగేషన్‌ కు రూ. 68,293 కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ నాలుగున్నరెళ్ళల్లో 22,165 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నెల్లూరు, రాయలసీమల్లో టీడీపీ ఇరిగేషన్‌ కు రూ. 13,939 ఖర్చు చేస్తే.. టీడీపీ రూ. 2,637 మాత్రమే ఖర్చు చేసిందన్నారు. దేశంలో నదుల అనుసంధానంకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, రాజశేఖర్ రెడ్డికి ఇరిగేషన్ మీద అవగాహన ఉందని, ఇరిగేషన్ మీద అవగాహన లేకపోతే ఎలా వుంటుందో జగన్‌ ను చూస్తే తెలుస్తోందన్నారు చంద్రబాబు.

Advertisment
Advertisment
తాజా కథనాలు