TDP Chief Chandrababu: రాఖీ పౌర్ణమి వేడుకల్లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
తెలుగు దేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశక్తి - రక్షా బంధన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు పీతల సుజాత, వంగలపూడి అనిత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. మహిళలకు మూడు గ్యాస్ సిలెండర్లు కాకుండా అవసరమైతే మరో సిలెండర్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలను శక్తి మంతులుగా చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని సంకల్పం చేసుకుని ప్రయత్నించండని పిలుపునిచ్చారు.