Andhra Pradesh:పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ నేతల ఆగ్రహం

ఆంధ్రాలో రాజకీయాలు మంచి వాడీవేడిగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల్లో సీట్ల సర్దుబాటు విషయంలో రచ్చరచ్చ అవుతోంది. బీజేపీ పోటీ చేయాలనుకున్న స్థానాల్లో టీడీపీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Andhra Pradesh:పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ నేతల ఆగ్రహం

TDP-BJP seats War: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులు పెట్టుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న సీట్లు అడ్డంగా చీలిపోయాయి. పొత్తు ధర్మ పాటిస్తూ ఒక పార్టీ సీట్లు మరొక పార్టీకి వెళ్ళిపోయాయి. మాట అయితే ఇచ్చాయి కానీ అధిష్టానాలు మాత్రం వీటిని సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఈ వార్ ఎక్కువగా సాగుతోంది. మధ్యలో బీజేపీ కూడా జాయిన్ అవడంతో ఈ తలనొప్పి మరింత ఎక్కువ అయింది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆంధ్రాలో బీజేపీకి దక్కినవే పది సీట్లు. ఇప్పుడు అవి కూడా ఎవ్వరికి ఇవ్వాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు తమకు దక్కుతాయనుకున్న టికెట్లు రాకపోవడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు..

బిజెపి పోటీ చేయాలనుకున్న రెండు పార్లమెంటు స్థానాల్లో టిడిపి అభ్యర్థులను ప్రకటించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, హిందూపురం స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. విశాఖ నుండి పురంధరేశ్వరి, జీవిఎల్...హిందూపురం నుండి పరిపూర్ణానంద స్వామి, సత్య కుమార్ పోటీ చేయాలని ప్లాన్‌లో ఉన్నారు. దీని కోసం అధిష్టానంతో లాబీయింగ్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరెండు స్థానాల్లో టీడీపీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా సీట్లను ఎలా ప్రకటిస్తారు అంటూ మండిపడుతున్నారు.

Also Read:Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

Advertisment
Advertisment
తాజా కథనాలు