TDP-Janasena-BJP: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!

పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా

TDP-Janasena-BJP: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!
New Update

Modi-Pawan Kalyan-Chandrababu: సార్వత్రిక ఎన్నికల (Elections) షెడ్యూల్‌ విడుదల అయిపోయింది. అలా షెడ్యూల్‌ వచ్చిందో లేదో ఇలా ఏపీలో ఓ భారీ బహిరంగ సభ జరుగబోతుంది. పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ఈ సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మూడు పార్టీల తరుఫున కలిపి సుమారు 10 లక్షల మంది కార్యకర్తలు సభకు వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన తరువాత మొదటి సారి జరుగుతున్న సభ కావడంతో నేతలు భారీగా తరలి వచ్చే సూచనలున్నాయి. బీజేపీతో పొత్తు కంటే ముందు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన రెండు కలిపి బహిరంగ సభ నిర్వహించారు. ఆదివారం ప్రజాగళం పేరుతో నేడు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

సరిగా పది సంవత్సరాల క్రితం అంటే 2014 సమయంలో వీరు ముగ్గురు కలిసి ఒకే వేదిక పై ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఆ తరువాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఈరోజు ఒకే వేదిక పై ఎన్నికల ప్రచారంలో కనిపిస్తు్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఈ సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అందుకే జనసేన-టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ సభ వేదికగా ఏపీ భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నామో మోదీ, చంద్రబాబు, పవన్‌ తెలపనున్నారు.

సాయంత్ర ఐదున్నర గంటల ప్రాంతంలో మోదీ సభా వేదిక మీదకు వస్తారు. అక్కడ గంటసేపు ఉంటారు. ఈ సభను మొత్తం 300 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్ఎస్జీ బృందం శనివారమే సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

#modi #prajagalam #pawankalyan #gunturu #bjp #tdp #janasena #cbn
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe