TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!!

టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా
New Update

TCS : గతేడాది ప్రారంభం నుంచి టెక్ ఉద్యోగులు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్(Amazon), ఈబే(Ebay) లాంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. కానీ టీసీఎస్(TCS) మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) మీద ఏకంగా 5లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.వ్యాపార అవకాశంగా ఉత్పాదక AI ఇప్పటికీ "ప్రారంభ దశలోనే ఉందని.. దాని ఉపయోగం ఇంకా తక్కువగా ఉందని పేర్కొంది. కస్టమర్ల కోసం కొనసాగుతున్న పనిని వేగవంతం చేయడానికి Gen AI నుండి పొందిన సమాచారాన్ని కంపెనీ ఉపయోగిస్తుందని కంపెనీ వెల్లడించింది.

కొన్ని నెలల క్రితం 250 జనరేటివ్ AI ఆధారిత ప్రాజెక్ట్‌లలో తన ప్రమేయాన్ని కూడా కంపెనీ ప్రకటించింది.వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్స్ అనే రెండు కీలక రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఏఐ భవిష్యత్తు కోసం టీసీఎస్ చురుగ్గా రెడీ అవుతోందని కంపెనీ ఏఐ క్లౌడ్ (AI Cloud)యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు.

ఏఐ మీద ట్రైనింగ్ ఇచ్చేందుకు కంపెనీ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది..ఎప్పటికి పూర్తి చేయనుందనే విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే గతంలో మాత్రం టీసీఎస్ కంపెనీ 150,000 మందికి ఏఐలో ట్రైనింగ్ ఇచ్చేందుకు 7నెలల సమయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఐదు లక్షల మందికి ఎన్నిరోజుల్లో ట్రైనింగ్ ఇస్తుందనే అంచనా వేయవచ్చు.

ఇది కూడా చదవండి: అయోధ్యలో భక్తుల రద్దీ.. వారిని దర్శనానికి వెళ్ళవద్దన్న ప్రధాని మోదీ..!!

ఏఐ సాంకేతికత(AI Technology) ద్వారా ఉద్యోగాలు పోతాయని చాలా కంపెనీల సీఈవో(CEO)లు వెల్లడించారు. కానీ ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకునేందుకు మానవ ప్రమేయం అవసరమని..తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కొందరు భావించారు. ప్రస్తుతం ఆ భావనే నిజమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ ఏఐపైన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

#train #tcs #employees #ai #artificial-intelligence
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe