kodali nani: యువగళం యాత్రకు స్పందన కరువైంది నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. By Karthik 24 Aug 2023 in గుంటూరు New Update షేర్ చేయండి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తనను అర్ధనగ్నంగా నడిపిస్తానడంపై స్పందించిన కొడాలి నాని.. లోకేష్ యువగళం యాత్రకు ప్రజా స్పందన రావడంలేదని బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ స్కూల్‌కు వెళ్లే వయసులో తాను పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర పూర్తి అవగానే ప్రజలు లోకేష్‌ని కుప్పంకు తరమికొడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయ్యే 9 నెలల తర్వాత తండ్రి కొడుకులు వారి ముఖాన్ని ప్రజలకు చూపించలేరన్నారు. లోకేష్ తన మాటలతో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నాయడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని.. చంద్రబాబు ఎన్టీఆర్‌ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచిన బాబు.. తన భార్యతో కలిసి వెళ్లి టీడీపీలో చేరేందుకు నందమూరి తారకరామారావు కాళ్లు పట్టుకున్నారని వీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ పార్టీలో చేర్చుకున్నాక సొంత మామనే మోసం చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య తిరుగుతున్న చంద్రబాబు నాయుడికి దమ్ముంటే.. గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. తనపై పోటీ చేసి గెలవలేని చంద్రబాబు నాయుడు వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్‌ను హైలెట్ చేయాలని చూస్తున్నారని కొడాలి అన్నారు. అందుకే ప్రజా స్పందన లేకున్నా.. లోకేష్ యాత్రను గ్రాఫిక్స్‌తో చూపిస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను అక్కడికి వెళ్లి లోకేష్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించి తీరుతానని కొడాలి నాని పేర్కొన్నారు. #gudivada #ntr #chandrababu #tdp #ycp #yuvagalam #kodali-nani #lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి