YS Sharmila: భారతి చేయాలనుకున్న పాదయాత్రను నేను చేశానా?.. దమ్మంటే నిరూపించండి.. షర్మిల ఛాలెంజ్..!
తాను స్వార్థం కోసం పాదయాత్ర చేశానంటూ జైల్లో అధికారి చెప్పాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? అంటూ సవాల్ చేశారు. ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మతో చెప్పించండి అని అన్నారు.