Ind Vs Ire: తొలి వన్డే భారత్‌దే.. అదరగొట్టిన అమ్మాయిలు!
ఐర్లాండ్‌తో మొదలైన మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ విధించిన 239 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలో అలవోకగా ఛేదించింది.