Mithali Raj: మాజీ భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ పెళ్లిపై తన మనసులో మాట బయటపెట్టింది. 42 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకోకుండా ఉండటానికి బలమైన కారణం ఉందని చెప్పింది. ఈ మేరకు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మిథాలీ కెరీర్ అనుభవాలతోపాటు పెళ్లి, తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia) ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం! బంధువుల టార్చర్ తట్టుకోలేక.. "కెరీర్ సక్సెస్ గా రాణిస్తున్నపుడు పెళ్లి సంబంధాలు వచ్చాయి. మా అమ్మ, బంధువుల టార్చర్ తట్టుకోలేక కొన్ని పెళ్లిచూపులకు అంటెడ్ అయ్యాను. ఈ క్రమంలో కొంతమంది అబ్బాయిలతో మాట్లాడాను. పరిచయం కాగానే పెళ్లి తర్వాత జీవితం, పిల్లల గురించి మాట్లాడేవారు. నేను మాత్రం నా కెరీర్ గురించి ఆలోచించేదాన్ని. ఎవరితోనూ దీని గురించి చెప్పలేక ఒత్తిడికి గురయ్యేదాన్ని. కెప్టెన్‌గా ఉన్న టైమ్ లో ఒకతను పెళ్లిచూపులకు వచ్చి క్రికెట్ మానేసి పిల్లలను చూసుకోవాలని చెప్పాడు. పెళ్లి తర్వాత అత్తగారికి సేవలు చేయాలన్నాడు. క్రికెట్ ఆడాలనుకుంటున్నావా అని కూడా అడిగాడు. ఏది ముఖ్యం అంటూ కండీషన్స్ పెట్టాలని చూశాడు. దీంతో ఆ సంబంధానికి నో చెప్పాను' అని తెలిపింది. Also Read: సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ View this post on Instagram A post shared by Mithali Raj (@mithaliraj) అయితే తన ప్రవర్తన మార్చకుని, అడ్జస్ట్ కావాలని స్నేహితులకు కూడా చెప్పినట్లు గుర్తు చేసింది. సర్దుకోవడం అలవాటు చేసుకోవాలని, లేదంటే మొగుడు దొరకడని ఆటపట్టించేవారని చెప్పింది. అయితే అమ్మనాన్నలు ఒత్తిడి చేసినప్పుడు.. పెళ్లి తన వల్ల కాదని గట్టిగా చెప్పేశానని, ఒక మగాడు, మొగుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేయలేనని తెగేసి చెప్పినట్లు వివరించింది మిథాలీ. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!