/rtv/media/media_files/2025/02/02/nuoDHjdtXr2GqmdS5z3W.jpg)
bcci women's
టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులు, కోచ్ సూషిన్ అల్ ఖదీర్ సహా ఇతర సహాయక సిబ్బందికి రూ. 5 కోట్ల రివార్డును తాజాగా ప్రకటించింది. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు తెలిపింది. మలేషియాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
9 వికెట్ల తేడాతో ఘనవిజయం
మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) చేసిన పరుగులే టాప్ స్కోర్. ఆ తరువాత 83 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేశారు. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది మ్యచ్‌తోపాటుగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన తండ్రికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అంకితం చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా త్రిష (309) నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది త్రిష. ఇక ఈ టోర్నీ మొత్తంలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ భారత్‌కు చెందిన వైష్ణవి శర్మ (17) నిలువగా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఆమె నిలిచింది. వైష్ణవి శర్మ ఒక ఇన్నింగ్స్‌లో (5/5) వికెట్లు తీసింది.
BCCI Congratulates #TeamIndia Women’s U19 Team for Back-to-Back T20 World Cup Triumphs, announces a cash reward of INR 5 Crore for the victorious squad and support staff, led by Head Coach Nooshin Al Khadeer.#U19WorldCup
— BCCI (@BCCI) February 2, 2025
Details 🔽