Liquor Lorry Video: ఏపీలో మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు జాతరే జాతర..!
విశాఖ మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఆ లిక్కర్ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి అక్కడే ఉన్న స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
విశాఖ మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఆ లిక్కర్ బాటిల్స్‌ను తీసుకెళ్లడానికి అక్కడే ఉన్న స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆంధ్రాలోని విశాఖపట్నంలో రూ.1.30 కోట్లు హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మిషన్ లో భారీ కరెన్సీ నోట్ల కట్టలను విజయవాడకు వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో పాటూ 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వైజాగ్ రాజకీయమంటేనే సమ్‌థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీకే దక్కాయి. దీంతో 2024లో విశాఖ రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతుండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్ధితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. మృతి చెందిన మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. అనుస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖలో కోటికత్తి కేసు దాడిపై విచారణ ఎన్ఐఏ కోర్టులో నిర్వహించారు. లాయర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ వాయిదా వేసింది. అంతేకాకుండా నిందితుడు శ్రీనివాస్‌రావును విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను కోర్టు ఒప్పుకుంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.
వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు.