Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా?
విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.