ఆంధ్రప్రదేశ్ TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Twist in Student Ritu Sahu Incident: వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!! వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితు సాహు ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఇక కాలేజీ, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్యం చేసిన డాక్టర్ల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakha: ఠాగూర్ సినిమా సీన్ రిపీట్... పాపం పసికందు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.యమకింకరుల్లా మారి ప్రాణాలను హరిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి నీచానికి వడిగడుతున్నారు. ఆ బెబీకి ఏమైంది..? బతికున్న బాబు.. మరణించాడని ఎందుకు చెప్పారు?. డబ్బు కోసం ఎంతకైన తెగిస్తారా..? చిన్నారి అని కూడా చూడకుంట ఇంత దారుణమా..? By Vijaya Nimma 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా? విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Man Commits Suicide: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్(30) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే డబ్బులు సర్దుబాటు కాక సమయానికి డబ్బులు కట్టలేకపోయాడు. కొంత మొత్తమే తిరిగి చెల్లించాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం హేమంత్ మృతిపై తండ్రి గున్న శ్రీనివాసరావు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Janavani Program: బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోం.. అండగా ఉంటాం: పవన్ విశాఖ దస్పల్లా హోటల్ లో 'జనవాణి' కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పవన్ ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు. గ్రామంలో వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Vasupalli Sentenced to Six Months in Jail: వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి షాక్.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి 6 నెలల సాధారణ జైలుతో పాటు 5 వేల రూపాయలను జరిమానా విధించింది. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn