Viral Fever: ఈ జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్ మటాష్!

ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్‌ నుంచి ఉపశమనం పొందాలంటే డైలీ కూరగాయల జ్యూస్‌లు తాగాలి. అలాగే గోరువెచ్చని నీరు తాగడం, శుభ్రత పాటించడం, బాడీ హైడ్రేట్‌గా ఉంచుకోవడం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే తొందరగా వైరల్ ఫీవర్ మటాష్ అవుతుంది.

New Update
viral fever88

చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, డెంగీ వంటి వాటితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్ బారిన ఒక్కసారి పడితే చాలు.. దాదాపుగా కొన్ని రోజుల వరకు నీరసం, అలసట అన్ని ఉంటాయి. వాతావరణంలో మార్పుల వల్ల కొందరు అయితే మరికొందరు శుభ్రం పాటించకపోవడం వల్ల ఈ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. దీని నుంచి బయట పడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

శుభ్రత పాటించడం కూడా ముఖ్యమే..

రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా జ్వరం వస్తుంది. వైరల్ ఫీవర్ ఉన్నవారు ఎక్కువగా కూరగాయల జ్యూస్‌లు తాగాలి. వీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బాడీ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. వైరల్ ఫీవర్స్‌ను నివారించాలంటే మందులు ఎంత ముఖ్యమో.. శుభ్రత పాటించడం కూడా అంతే ముఖ్యం. బయటకు వెళ్లి వచ్చిన, భోజనం చేసే ముందు ఎప్పుడైనా కూడా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. జ్వరం ఉన్న వారి వస్తువులను వాడకూడదు. 

ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!

జ్వరాలు రావడానికి ముఖ్య కారణం దోమలు. ఇవి ఎక్కువగా నీటిలో వృద్ధి చెందుతాయి. ఇంట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వింటర్ సీజన్ ప్రారంభం అయ్యిందంటే వేడి నీరు తాగడం అలవాటు చేసుకోండి. చల్లని నీటి వల్ల వైరల్ ఫీవర్స్ ఇంకా అధికం అవుతాయి. అలాగే జ్వరం ఉన్న సమయంలో బాడీ అలసటగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !

Advertisment
Advertisment
తాజా కథనాలు