బీహార్ వాసులను వణికిస్తున్న కొత్త ఫీవర్ బీహార్ వాసులను లేమ్ ఫీవర్ వణికిస్తోంది. దోమ కాటుతో వ్యాపి చెందుతున్న ఈ వైరస్ సోకితే చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపక్కన దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫీవర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 24 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బీహార్ వాసులను ఓ విచిత్రమైన జ్వరం వణికిస్తోంది. లేమ్ ఫీవర్ అనేది పాట్నాను కుదిపేస్తోంది. చాపకింద నీరులా ఈ వైరల్ ఫీవర్ విస్తరించడంతో బీహార్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దోము కాటుతో ఈ లేమ్ ఫీవర్ వేగంగా విస్తరిస్తోంది. జ్వరపీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. లేమ్ ఫీవర్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పాట్నా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది కూడా చూడండి: కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే! ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం వల్ల.. లేమ్ ఫీవర్‌ను కుంటి జ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఫీవర్ బారిన పడినవారిలో చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుంది. దీనివల్ల రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? జ్వరం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రయత్నించాలి. వీలైనంత వరకు ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వేడి, తేమ సమయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చినప్పుడు కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇలా జరిగితే విశ్రాంతి తీసుకోవాలి. ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన! సీజన్ మారడం లేదా వర్షాల కారణంగా కూడా జ్వరం వస్తుంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోకపోతే.. అది చివరకు ప్రమాదకరం అవుతుంది. జ్వరం ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం అసలు చేయకుండా కేవలం వేడి నీటితో మాత్రమే స్నానం చేయండి. ఈ సీజన్‌లో చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీరు మాత్రమే తాగడం అలవాటు చేసుకోండి. ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు! #fever #viral-fever మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి