లాంఛ్ రిహార్సల్ పూర్తి... ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్.....! ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. By G Ramu 30 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి చంద్రయాన్-3 తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) రెడీ అవుతోంది. తాజాగా ఆదిత్య-ఎల్ 1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆదిత్య ఎల్-1 కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ ను ఇస్రో పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. ఈ మిషన్ కు సంబంధించి లాంఛ్ రిహార్సల్, రాకెట్ లో అంతర్గత తనిఖీలు పూర్తి చేశామని వెల్లడించింది. ఇక సూర్యునిపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో చేపట్టిన మిషన్ ఆదిత్య ఎల్-1. ఈ మిషన్ లో భాగంగా భూమికి 1.5 మిలియన్ల దూరంలో వున్న లాగ్రాంజియన్ పాయింట్ చుట్టు ఉండే కక్షలో ఈ శాటిలైట్ ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు. PSLV-C57/Aditya-L1 Mission:The preparations for the launch are progressing. The Launch Rehearsal - Vehicle Internal Checks are completed. Images and Media Registration Link https://t.co/V44U6X2L76 #AdityaL1 pic.twitter.com/jRqdo9E6oM— ISRO (@isro) August 30, 2023 also read: సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం ఈ శాటిలైట్ ను లాగ్రాంజియన్ పాయింట్ కక్షలో ప్రవేశ పెట్టడంతో సూర్యున్ని ఎలాంటి అడ్డంకులు లేదా గ్రహణాలు లేకుండా చూసే అవకాశం కలుగుతుందని ఇస్రో పేర్కొంది. ఈ శాటిలైట్ లో ఉండే పేలోడ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, పర్టికల్ డిటెక్టర్స్ ను ఉపయోగించి సూర్యునిలో ఉండే ఫోటో స్పియర్, క్రోమో స్పియర్, ఇతర పొరల గురించి పరిశోధనలు చేసి సమాచారాన్ని అందించనుంది. also read: చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్…. చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో…! ఆదిత్య-ఎల్ 1 పేలోడ్ సూట్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం డైనమిక్స్, రేణువులు, క్షేత్రాల వ్యాప్తిని అధ్యయనం చేసేందుకు, వాటి సమస్యలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాయని వివరించింది. ఇది ఇలా వుంటే తాజాగా చంద్రయాన్-3లోని ప్రజ్జాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. దానికి సంబంధిచిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. also read: విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత… తెరపైకి కొత్త పేరు….! #payloads #pragyan #isro #vikram #lander #aditya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి