Vemulawada : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపూర్ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు.
Aghori In Karimnagar : కరీంనగర్ లో అఘోరీ హల్ చల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్న అఘోరి కరీంనగర్లో హల్చల్ చేసింది.సనాతనధర్మాన్ని కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటిస్తూ వచ్చిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.
BIG BREAKING: వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం!
మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వేములవాడ ఆలయాన్ని దర్శించుకోగా స్వామివారి నైవేద్యాన్ని ఆపి మరీ అర్చకులు సురేఖ ఫ్యామిలీకి పూజలు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vemulawada : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ!
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.