/rtv/media/media_files/2025/01/25/OyZK5HYUjws5F3jpCJYT.jpg)
Aghori in Karimnagar
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్న అఘోరి కరీంనగర్‌లో హల్‌చల్ చేసింది. వరుసగా దేవాలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ సనాతనధర్మాన్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటిస్తూ వచ్చిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది. అలుగునూరులోని పెట్రోల్‌పంపు వద్ద తన కారును ఆపగా విషయం తెలిసిన మీడియా ప్రతినిథులు అక్కడికి చేరుకున్నారు. కాగా అఘోరిని చూసి స్థానిక యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు.
ఇది కూడా చూడండి: Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మహా కుంభమేళా నుంచి వస్తున్నానని తెలిపారు. ఫిబ్రవరి 3న తను వేములవాడ వెళ్తున్నానని, దేవాలయంలో ఉన్న దర్గాను కూల్చేవరకు తన పోరాటం ఆగదన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటంతో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనన్నారు. ఈ విషయంపై తన గురువులతో మాట్లాడినట్టు తెలిపింది. మసీదును తానే స్వయంగా కూల్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో తను ముందుంటానన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే సహించనని తేల్చి చెప్పారు. ఎక్కడైతే అధర్మం తిష్ట వేసుకుంటుందో అక్కడ తను ప్రత్యక్షమవుతానని, అ ధర్మాన్ని అంతం చేసేంతరకు పోరాడుతానని అఘోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
కాగా లేడీ అఘోరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను సందర్శిస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. తెలంగాణలోని వేములువాడ, కొండగట్టు, ఏపీలోని కాళహస్తి తదితర దేవాలయాలను సందర్శించారు. కొన్ని దేవాలయాల్లో నగ్నంగా దర్శించుకోవడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో వారితో అఘోరి గొడవ పడింది. సనాతనధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తానని మంచిర్యాలలో ప్రకటించడంతో ఆమెను కొంతకాలం గృహ నిర్భందంలో ఉంచారు. అనంతరం అమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి మహారాష్ర్టలో వదిలేశారు. మహాకుంభమేళా ముగిసిన తర్వాత తిరిగి వస్తానని చెప్పిన అఘోరీ కుంభమేళా సమయంలోనే మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమవడం సర్వత్రాచర్చనీయంశంగా మారింది.