ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..!
గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.